News October 11, 2025

పవన్ హాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(0CT 12)ఆఖరు తేదీ. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://www.pawanhans.co.in/

Similar News

News October 11, 2025

Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

image

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్‌లు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2025

‘చిత్త కార్తె’ అంటే ఏంటి?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నక్షత్రంలో 13-14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ కార్తె పేరుతో అని పిలుస్తారు. సమస్త ప్రాణకోటితో పాటు ప్రకృతి ప్రవర్తనలపై ఇవి ప్రభావం చూపుతాయి. భానుడు ఇవాళ చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో చిత్త కార్తె ప్రారంభం అవుతోంది.
* ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 11, 2025

‘RARE’ invitation: ఖనిజ తవ్వకాలకు అఫ్గాన్‌ ఆహ్వానం!

image

‘rare earth minerals’.. పేరుకు తగ్గట్లే అత్యంత అరుదైన ఖనిజాలివి. వీటి కోసమే అమెరికా, పాశ్చాత్య దేశాలు పాక్‌తో అంటకాగుతున్నాయి. ఈ క్రమంలో $1 ట్రిలియన్‌‌కు పైగా విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న అఫ్గాన్‌ ఇండియా వైపు చూస్తోంది. మినరల్స్, ఎనర్జీ సెక్టార్‌లో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. లిథియం, ఐరన్ ఓర్, కాపర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అఫ్గాన్ మైన్లలో దొరుకుతున్నాయి.