News October 26, 2025

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపి‌తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://devnetjobsindia.org

Similar News

News October 26, 2025

వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

image

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్‌గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News October 26, 2025

భారీ జీతంతో 16 ఉద్యోగాలు

image

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(AcSIR) 16 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్, Sr మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://acsir.res.in/

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.