News September 17, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 16 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.150. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

Similar News

News February 2, 2026

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

image

TG: మున్సి‘పోల్స్’లో పోటీచేసే పార్టీ అభ్యర్థులను PCC ఖరారు చేసింది. స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకు అభ్యర్థుల జాబితాను ఆమోదించింది. కొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ నిర్ణయించిన వారికే B ఫారాలు అందిస్తారు. విత్‌డ్రా గడువులోగా వీటిని అధికారులకు సమర్పించాలి. కాగా PCC చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల కమిటీ జూమ్ సమావేశం జరిగింది. CM, పార్టీ ఇన్‌ఛార్జ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

News February 2, 2026

పాక్ జట్టుకు ఇదేం కొత్త కాదు: సునీల్ గవాస్కర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. ‘ముందు ఓ నిర్ణయం తీసుకొని మళ్లీ దాన్ని మార్చుకోవడం పాక్ క్రికెటర్లకు అలవాటే. వారిది యూటర్న్‌ల చరిత్ర. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాబట్టి 15వ తేదీలోపు బాయ్‌కాట్ నిర్ణయంపై కూడా వారు వెనక్కి తగ్గొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.

News February 2, 2026

అజిత్ మృతి అనుమానాస్పదమే: MP సంజయ్

image

దివంగత MH Dy CM అజిత్ పవార్ మరణంపై శివసేన MP సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తుంటే విమాన ప్రమాదం సందేహాస్పదంగా ఉందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. NCP 2వర్గాల విలీనానికి BJP ఒక అడ్డంకి అని ఆరోపించారు. ఈ తరుణంలోనే అజిత్ లాంటి నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.