News September 10, 2025

విజయవాడలోని సీపెట్‌లో ఉద్యోగాలు

image

విజయవాడలోని <>సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్<<>> ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ప్లాస్టిక్ ఇంజినీరింగ్&టెక్నాలజీ, మెకానికల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. అప్లైకి SEP 28 ఆఖరు తేదీ.

Similar News

News September 10, 2025

మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

image

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.

News September 10, 2025

మైథాలజీ క్విజ్ – 2

image

1. దశరథుడి తండ్రి పేరేంటి?
2. మహాభారతంలో ‘గాంగేయుడు’ అని ఎవర్ని అంటారు?
3. ‘చిఖల్ కలో’ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మనం ఏ పండగ జరుపుకుంటాం?
5. తుంబురుడి వీణ పేరేంటి?
6. ‘శ్వేత సౌధం’(The White Pagoda) అని ఏ ఆలయాన్ని అంటారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

News September 10, 2025

మనం రోజూ వాడే ఈ పదాల అబ్రివేషన్ తెలుసా?

image

*WiFi- వైర్‌లెస్ ఫిడిలిటీ, *ATM- ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్, *RIP – రెస్ట్ ఇన్ పీస్, *AM- యాంటి మెరిడియన్, *PM- పోస్ట్ మెరిడియన్, *QR Code- క్విక్ రెస్పాన్స్ కోడ్, *PIN- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, *IQ- ఇంటెలిజెన్స్ కోషెంట్ (తెలివితేటలు), *PDF- పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, *SIM- సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, *GPS- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.