News October 3, 2025

CSIR-IICTలో ఉద్యోగాలు

image

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS

Similar News

News October 3, 2025

రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 3, 2025

మేక, గుర్రం గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

మేకలు, గొర్రెలను వేటాడటం ఇతర జంతువులకు అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటి కనుపాపలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి 340 డిగ్రీల(మనిషికి 180 డిగ్రీలు) విశాల దృష్టితో చూడగలవు. UC బర్కిలీ పరిశోధకుల ప్రకారం మేకలు తలదించి మేస్తున్నప్పుడు కూడా తల తిప్పకుండా 50డిగ్రీల వరకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలవు. ఇది మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి మేసే జంతువులకు తప్పించుకోవడానికి సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది.

News October 3, 2025

మధ్యప్రదేశ్‌లో ‘టమాటా వైరస్’ కలకలం

image

MPలోని భోపాల్‌లో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. 200 మంది స్కూల్ విద్యార్థులు దీని బారినపడ్డారు. ఈ వైరస్ సోకినవారు చేతులు, కాళ్లు, అరికాళ్లు, మెడ కింద తీవ్రమైన దురదతో బాధపడుతున్నారు. దద్దుర్లు తర్వాత పొక్కులుగా మారుతున్నాయి. ఒళ్లంతా మంట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది సులభంగా సోకుతోందని, బాత్రూమ్ వెళ్లినపుడు చేతులు సరిగ్గా కడుక్కోవాలని అధికారులు సూచించారు.