News October 13, 2025

ఇంటర్వ్యూతో ICAR-NMRIలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని ICAR-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ కాంట్రాక్ట్ పద్ధతిలో 4యంగ్ ప్రొఫెషనల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు ఈనెల 28న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://nmri.res.in/

Similar News

News October 13, 2025

ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

image

ఢిల్లీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్‌లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.

News October 13, 2025

లాలూపై అభియోగాలు.. ఎన్నికల వేళ ఆర్జేడీకి షాక్

image

బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఆర్జేడీకి ఎదురుదెబ్బ తగిలింది. IRCTC స్కామ్ కేసులో ఆ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. అవినీతి, నేరపూరిత కుట్ర, చీటింగ్ ఛార్జెస్ నమోదు చేసింది. వారు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. కాగా కేసు విచారణకు స్వయంగా లాలూ వీల్‌ఛైర్‌లో హాజరయ్యారు.

News October 13, 2025

‘కపాస్ కిసాన్ యాప్’.. వాడకం ఎలా?

image

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.