News May 19, 2024

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. రేపటి నుంచి నియామక డ్రైవ్

image

ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కార్మికుల ఉద్యోగాలకు HYD న్యాక్‌లో రేపటి నుంచి ఈనెల 24 వరకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 21-45 ఏళ్ల వయసు, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. నెలవారీ వేతనం ప్యాకేజీలు రూ.1.20లక్షల నుంచి రూ.1.38 లక్షల వరకు ఉంటాయి. పూర్తి వివరాలకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ <>వెబ్‌సైట్<<>> లేదా 9985483931/7893566493 నంబర్లలో సంప్రదించండి.

Similar News

News January 7, 2026

విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

image

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.

News January 7, 2026

భారత్ ఘన విజయం

image

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.

News January 7, 2026

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్లాస్టిక్ బకెట్లే వాడాలి. ఇనుప బకెట్లు వద్దు. నీటిలో హీటర్ పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. హీట్ అవుతున్నప్పుడు నీళ్లను, బకెట్‌ను తాకకూడదు. నీళ్లు వేడయ్యాక స్విచ్ఛాఫ్ చేశాకే రాడ్ తీసేయాలి’ అని చెబుతున్నారు. తాజాగా UP ముజఫర్‌నగర్‌లో లక్ష్మి(19), నిధి(21) అనే అక్కాచెల్లెలు హీటర్ రాడ్ తగిలి విద్యుత్ షాక్‌తో చనిపోయారు.