News September 11, 2025

రూ.78వేల జీతంతో RBIలో జాబ్స్

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 ఆఫీసర్ గ్రేడ్-బీ (జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం) పోస్టుల భర్తీకి <>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ పాసైన వారు అర్హులు. వయసు 21-30 మధ్య ఉండాలి. బేసిక్ పే నెలకు రూ.78,450 ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in/

Similar News

News April 8, 2026

కృష్ణా: నాసిరకం రంగులతో ప్రాణాపాయం.. డ్రింక్స్‌పై నిఘా ఏది?

image

జిల్లాలో వేసవి వేడిని ఆసరాగా చేసుకొని కల్తీ శీతల పానీయాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానికంగా తయారయ్యే డ్రింక్స్‌లో నాసిరకం ముడిసరకులు, ప్రాణాపాయం కలిగించే ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిల్వ గడువు, శుభ్రతను గాలికి వదిలేసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News April 8, 2026

మేం కూలీలం: షమీ

image

‘మేం కూలీలం. మా పని బౌలింగ్ చేయడమే’ అంటూ పేసర్ షమీ తన మనసు విప్పారు. జీవితంలో గాయాలు, ఎత్తుపల్లాలు సహజమని.. గ్రౌండ్ లెవల్‌లో చేసే కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని కుర్రాళ్లకు సూచించారు. అందరూ ఫ్యాన్సీ విషయాల వెనుక పడితే అదే బలహీనత అవుతుందని హెచ్చరించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొడుతున్నా టీమ్ఇండియాలో షమీకి చోటు దక్కడం లేదు. అయినా ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

News April 8, 2026

వెంటనే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ

image

ఇరాన్‌లో ఉంటున్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయటపడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇందుకోసం ఎంబసీ సాయం తీసుకోవాలని, సూచించిన రూట్లలో వెళ్లాలని కోరింది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా అంతర్జాతీయ భూ సరిహద్దులకు వెళ్లొద్దంది. ఈ మేరకు హెల్ప్‌లైన్ నంబర్ల(+989128109115; +989128109109; +989128109102; +989932179359)లో సంప్రదించాలంది. సీజ్‌ఫైర్ అయిన కొన్ని గంటలకే ఈ ప్రకటన రావడం గమనార్హం.