News October 7, 2025

RTCలో ఉద్యోగాలు.. ముఖ్య గమనిక

image

TGSRTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. SC అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు వర్గీకరణ ప్రకారం (గ్రేడ్-1,2,3) కొత్త ఫార్మాట్‌లో ఉండాలని అధికారులు తెలిపారు. కొత్త సర్టిఫికెట్‌ను సకాలంలో పొందలేకపోతే, అందుబాటులో ఉన్న SC సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. అయితే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 7, 2025

రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

image

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్‌కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్‌నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.

News October 7, 2025

AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

image

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్‌డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్‌ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్‌ను అందించడంలో ఇది సహకరిస్తుంది.

News October 7, 2025

గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదెందుకు: షర్మిల

image

AP: విశాఖ KGHలో చికిత్స పొందుతున్న <<17923468>>గురుకులాల<<>> పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని APCC చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వారి శరీరాలు చూస్తే ఏం ఆహారం పెడుతున్నారో కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దుయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.