News October 11, 2025
ఇండియన్ కోస్డ్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

ఇండియన్ కోస్ట్‌గార్డ్ 22 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్, ఎంటీఎస్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Similar News
News October 11, 2025
విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
News October 11, 2025
2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI

AI టెక్నాలజీ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఇక మనదేశానికి ఉండదు. ఎందుకంటే స్వదేశీ AI 2026 ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ ఏడాది చివరికి మన సొంత ఏఐ సాంకేతికత పూర్తవుతుందని, ఆపై అందుబాటులోకి వస్తుందని MeitY సెక్రటరీ కృష్ణన్ తెలిపారు. ‘38వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU)తో ఉండే ఈ ఏఐతో కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగుపడుతుంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0లో ఇది కీలకమవుతుంది’ అని తెలిపారు.
News October 11, 2025
భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2025 పోటీల్లో INDకి చెందిన షెర్రీసింగ్ విజయం సాధించారు. ఈ పేజెంట్‌లో మన దేశానికి తొలికిరీటం తెచ్చి షెర్రీ చరిత్ర సృష్టించారు. నోయిడాలో జన్మించిన షెర్రీ ఫ్యాషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్, మెంటల్ హెల్త్‌పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ‘ఈ విజయం నాది మాత్రమే కాదు. కలలు కనే ధైర్యం చేసిన ప్రతి స్త్రీకి చెందుతుంది.’ అని షెర్రీ అన్నారు.