News November 22, 2024
ఉద్యోగాలను ఏఐ ఇప్పట్లో భర్తీ చేయలేదు: గూగుల్ రీసర్చ్ హెడ్
టెక్ ఇండస్ట్రీలో AI వినియోగం పెరగడంపై గూగుల్ రీసర్చ్ హెడ్ యోస్సీ మాటియాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యూమన్ డెవలపర్లను ఇప్పట్లో AI భర్తీ చేయలేదని అన్నారు. కోడింగ్ నేర్చుకోవడం ఇప్పటికీ ముఖ్యమేనని పేర్కొన్నారు. కొన్ని టాస్క్‌లలో AI టూల్స్‌ను వినియోగిస్తున్నప్పటికీ, హ్యూమన్ కోడర్లకు AI ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. AI- రూపొందించిన కోడ్‌కు హ్యూమన్ రివ్యూ, వాలిడేషన్ అవసరం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News November 22, 2024
STOCK MARKETS: భారీ లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 23,458 (+107), సెన్సెక్స్ 77,548 (+390) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టి, PSU బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. ADANIENT, ADANI PORTS, M&M, AXIS BANK, HEROMOTO టాప్ లూజర్స్.
News November 22, 2024
47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.
News November 22, 2024
కూటమి నేతలకు అధికారమదం నెత్తికెక్కింది: YCP
కూటమి నేతలు అధికారమదం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని YCP ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనమండలిలో గురువారం మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన ఓ సామెతపై ఆ పార్టీ ‘X’ వేదికగా మండిపడింది. మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై ప్రచారం చేసి, ఇప్పుడు హజ్ యాత్రపై వెటకారమా? అని ప్రశ్నించింది. అటు, తన మాటలు ఏ కులాన్నీ, మతాన్నీ అవమానపరిచేలా లేవన్న మంత్రి ఒకవేళ ఉన్నట్లు భావిస్తే వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.