News April 21, 2025

ఏఐ రాకతో ఉద్యోగాలు గల్లంతే: ఒబామా, బిల్ గేట్స్

image

ఏఐ వినియోగంతో భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతామని USమాజీ అధ్యక్షుడు ఒబామా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐతో లభించే మెడికల్ , టీచింగ్ సలహాలు అందరికీ నచ్చుతాయని, కానీ ఉద్యోగాల పరిస్థితేంటని బిల్ గేట్స్ ప్రశ్నించారు. సాప్ట్‌వేర్ డెవలపర్స్ చేసే 70శాతం పనులను ఏఐ చేయగలదని, దీని వాడకం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతేనని, 100 ఏళ్లలో చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు.

Similar News

News April 22, 2025

మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

image

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 22, 2025

16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

image

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.

News April 22, 2025

ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

image

✒ 1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
✒ 1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం(ఫొటోలో)
✒ 1916: ప్రముఖ బెంగాళీ నటి కనన్ దేవి జననం
✒ 1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
✒ 1959: ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం
✒ 1994: US మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
✒ 2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం

error: Content is protected !!