News February 6, 2025
డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736574153027_893-normal-WIFI.webp)
224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero
Similar News
News February 6, 2025
పడుకునే ముందు ఈ పనులు చేస్తే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738860664433_367-normal-WIFI.webp)
రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.
News February 6, 2025
కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738859516648_893-normal-WIFI.webp)
కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News February 6, 2025
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738861142882_1032-normal-WIFI.webp)
TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.