News February 8, 2025

నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

image

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <>నోటిఫికేషన్ <<>>విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. ఫీజు రూ.300. CBT, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో CBT పరీక్షలు జరగనున్నాయి. సైట్: iocl.com

Similar News

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

News December 1, 2025

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.