News March 25, 2025

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

image

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500. ఏప్రిల్ 21 వరకు <>దరఖాస్తులకు<<>> అవకాశం ఉంది.

Similar News

News March 26, 2025

అర్జున్ టెండూల్కర్‌ను బెస్ట్ బ్యాటర్‌గా మారుస్తా: యువరాజ్ తండ్రి

image

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ‘అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతా. నా దగ్గర 12days శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా?’ అని గుర్తుచేశారు.

News March 26, 2025

రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

image

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్‌మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

News March 26, 2025

నేనలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: డీకే

image

ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగాన్ని మారుస్తామని తాను అనలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘ముస్లింలకు కోటా కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చగల “మంచి రోజు” రావచ్చు’ అని ఇటీవల ఓ కార్యక్రమంలో డీకే వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం మొదలైంది.

error: Content is protected !!