News February 24, 2025
పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
వెబ్ సైట్: indiapostgdsonline.gov.in
Similar News
News February 24, 2025
ప్రియుడి కోసం విషం తాగిన యువతులు

AP: విషం తాగి బతికినవాళ్లు ప్రియుడితో ఉండాలని ఇద్దరు అమ్మాయిలు పోటీపడిన ఘటన అనంత(D)లో జరిగింది. దివాకర్, రేష్మ, శారద ఒకే కాలేజీలో చదివారు. దివాకర్ను లవ్ చేసిన రేష్మకు మరొకరితో పెళ్లైంది. ఆ తర్వాత శారదను దివాకర్ లవ్ చేశాడు. ఇటీవల రేష్మ భర్తను వదిలేసి ప్రియుడి వద్దకొచ్చింది. రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో మాటల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ప్రస్తుతం శారద చనిపోగా, రేష్మ ఆస్పత్రిలో ఉంది.
News February 24, 2025
సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్: ప్రధాని మోదీ

ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా IND కొనసాగుతోందని వరల్డ్ బ్యాంక్ కొనియాడిందని PM మోదీ వెల్లడించారు. సౌరశక్తిలోనూ ఇండియా సూపర్ పవర్గా మారిందని UN ప్రశంసించిందన్నారు. MPలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో PM ప్రసంగించారు. ఇతర దేశాలు మాటలకే పరిమితమైతే భారత్ చేసి చూపిందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తే ఎకానమీ గ్రోత్, ఉద్యోగాల కల్పనకు దారి ఏర్పడుతుందన్నారు.
News February 24, 2025
జగన్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారు: అచ్చెన్నాయుడు

AP: జగన్, YCP MLAలు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని, ప్రజల కోసం కాదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని, ఉపఎన్నికలు వస్తే 11సీట్లు కూడా రావనే భయంతో వచ్చారన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ YCP అని మండిపడ్డారు. ఓ పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి నమ్మించాలని చూస్తే ఏమయిందో మొన్నటి ఎన్నికల్లో చూశామన్నారు.