News January 3, 2025

USను లాఫింగ్ స్టాక్‌గా మార్చిన జోబైడెన్: ట్రంప్

image

US చరిత్రలోనే జోబైడెన్ వరస్ట్ ప్రెసిడెంట్ అని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సరిహద్దులను బలహీనపరిచారని ఆరోపించారు. ఫలితంగా అమెరికా ఒక డిజాస్టర్, లాఫింగ్ స్టాక్‌గా మారిందన్నారు. న్యూఇయర్ వేడుకల్లో టెర్రరిస్టు దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. FBI, CIA, DOJ ఇలాంటివి ఆపకుండా, అన్యాయంగా తనపై దాడికే సమయం వృథా చేశాయని పేర్కొన్నారు. అమెరికాలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం, ఇతర నేరాలు ఊహించలేనంత పెరిగాయన్నారు.

Similar News

News November 28, 2025

DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

image

TG: తన G.O.A.T. టూర్‌ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

image

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.

News November 28, 2025

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

image

ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే పిల్లలు చదువుకొనేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. ఎప్పటికప్పుడు అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారు చేయాలి. మెమరీ గేమ్‌లు ఆడించాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.