News December 23, 2024

జో రూట్ ఎంట్రీ.. బెన్ స్టోక్స్ ఎగ్జిట్

image

భారత్‌తో వన్డే సిరీస్ కోసం నిన్న ఇంగ్లండ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌తో జో రూట్ 2023 తర్వాత భారత్‌పై తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొడకండరాల గాయం కారణంగా ఎంపిక కాలేదు. తొలి వన్డే ఫిబ్రవరి 6, రెండోది 9, మూడో వన్డే 12న జరగనున్నాయి. 5మ్యాచుల టీ20 సిరీస్ JAN 22- FEB 2 వరకు జరుగుతుంది. ఈ సిరీస్‌లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Similar News

News November 19, 2025

ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

image

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

News November 19, 2025

హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

image

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.