News April 5, 2025
సీఎం రేవంత్ రెడ్డికి జాన్ అబ్రహం రిక్వెస్ట్

కంచ గచ్చిబౌలి వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం స్పందించారు. ఆ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను నిలిపివేయాలని CM రేవంత్‌ని కోరారు. HYDకు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాల అడవిలో ఎన్నో వణ్యప్రాణులు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని ట్వీట్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీన్ని వ్యతిరేకించారు. అటు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు కొట్టొద్దని ప్రభుత్వాన్ని SC ఆదేశించింది.
Similar News
News April 12, 2025
ఓడితే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే: వెంకయ్య

AP: ఒకసారి ప్రజలు ఓటమి తీర్పు ఇచ్చాక ఇష్టమున్నా లేకపోయినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలకు ఆ ఓపిక ఉండటం లేదని చెప్పారు. తిరుపతిలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వంతో ఎన్ని చర్చలైనా జరపండి. చట్టసభలను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అది మనకు మనమే అపకారం చేసుకున్నట్లు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
News April 12, 2025
ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.
News April 12, 2025
పూరన్ విధ్వంసం.. LSG గ్రాండ్ విక్టరీ

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్‌ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్‌రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.