News September 19, 2024
జానీ మాస్టర్ అరెస్ట్.. నాగబాబు ట్వీట్లు వైరల్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్లు చేశారు. చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్ను పోస్ట్ చేశారు. మీరు వినేదే నమ్మొద్దని, ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు. దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. అత్యాచార కేసు నమోదవ్వడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసింది.
Similar News
News January 21, 2026
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం డాలర్తో కంపేర్ చేస్తే రూ.91.74కు సమానంగా ఉంది. అమెరికా-గ్రీన్లాండ్ ఉద్రిక్తతల నడుమ భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరిపారు. దీంతో మార్కెట్లు కుదేలై రూపాయి పతనం వైపు నడిచింది. అటు 2026లో రూపాయి విలువ 1.98% మేర పడిపోయింది. ఆసియాలో పతనమైన కరెన్సీలో ఇది రెండో ప్లేస్లో ఉంది.
News January 21, 2026
కుమారస్వామిని ఆరాధిస్తే..

కుమారస్వామిని ఆరాధించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఆయనను కొలిస్తే శత్రుభయం, కోర్టు సమస్యల నుంచి విముక్తి లభించి విజయాలు వరిస్తాయి. సునిశిత బుద్ధికి ప్రతీక అయిన ఆయన ‘వేలు’ (శూలం) పిల్లలకు చదువు, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుజ దోష నివారణకు, సంతాన ప్రాప్తికి, ఆధ్యాత్మిక ఉన్నతికి షణ్ముఖుని పూజ ఉత్తమమైన మార్గం. సర్ప రూపంలో ఆయనను ఆరాధించడం కుండలిని శక్తిని జాగృతం చేసి యోగ సాధనకు తోడ్పడుతుంది.
News January 21, 2026
శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్

శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఛార్జిషీట్ వేయడంలో SIT విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్టేట్మెంట్ల ఆధారంగా విచారించాల్సి ఉన్నందున పొట్టికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇక రాజీవరు బెయిల్పై కోర్టు గురువారం తీర్పు చెప్పనుంది.


