News September 19, 2024
పోలీసుల అదుపులో జానీ మాస్టర్

అసిస్టెంట్ డాన్సర్పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.
Similar News
News January 25, 2026
ఈ రథసప్తమి చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?

ఈ ఏడాది రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. సూర్యుడికి ఆదివారం అంటే మహా ప్రీతి. అదే రోజున ఆయన జన్మదినం రావడం ఈ పర్వదినాన రెట్టింపు శక్తినిస్తుంది. దీన్ని భాను సప్తమి అని కూడా అంటారు. ఈరోజు చేసే సూర్యారాధన, ధ్యానం, దానధర్మాలు కోటి రెట్లు ఫలితాన్నిస్తాయి. ఇలాంటి అరుదైన యోగం ఉన్న రోజున అరుణోదయ స్నానమాచరించి, సూర్యుడిని దర్శించుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగి ఐశ్వర్యం, ఆయుష్షు సిద్ధిస్తాయని నమ్మకం.
News January 25, 2026
మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టులో మరో 14 కులాలు

TG: మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (MBC) లిస్టులో మరో 14 కులాలను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో కేంద్రానికి లేఖ రాయనుంది. ప్రస్తుతం MBC లిస్టులో 36 కులాలు ఉండగా, ఆ సంఖ్య 50కి చేరనుంది.
14 కులాలు: దాసరి(బెగ్గరి), జంగం, పంబాల, వాల్మికి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, సిద్దుల, సిక్లింగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు, కునపులి, రాజనాల, బుక్క అయ్యవారాస్.
News January 25, 2026
రథసప్తమి.. తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ నుంచి చంద్రప్రభ వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. నేడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ చేయనుంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్సుంది.


