News September 27, 2024

విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడి?

image

అసిస్టెంట్‌ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. యువతి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, మైనర్‌గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేశాననడమూ అవాస్తవమని పేర్కొన్నట్లు సమాచారం. యువతి తీరుతో తానే బాధపడ్డానని, పెళ్లి చేసుకోమని వేధించిందని, తనపై కావాలనే కుట్ర చేశారని జానీ తెలిపినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

Similar News

News December 4, 2025

ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

image

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.

News December 4, 2025

జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

image

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.

News December 4, 2025

డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

image

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం