News September 26, 2024
ఇవాళ విచారణకు జానీ మాస్టర్ భార్య!

అత్యాచారం కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ విచారణ ఇవాళ రెండో రోజు కొనసాగనుంది. న్యాయవాది సమక్షంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. బాధితురాలు జానీ భార్య అయేషాపైనా ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఆమెనూ విచారణకు పిలిచే అవకాశం ఉంది. భార్యాభర్తలిద్దరినీ కలిపి ప్రశ్నిస్తారని సమాచారం.
Similar News
News January 24, 2026
KTRను నేరస్థుడిగా పరిగణించలేదు: జూపల్లి

TG: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతోందని, కేటీఆర్‌కు CRPC 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను నేరస్థుడిగా పరిగణించలేదని, సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచారని తెలిపారు. ప్రభుత్వానిది రాజకీయ కక్ష అనడం సరికాదని, కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాలని పేర్కొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
News January 24, 2026
కలెక్షన్స్‌లో ధురంధర్‌ను దాటేసిన బార్డర్-2

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్-2’ ఫస్ట్ డే ఇండియా(హిందీ) కలెక్షన్లలో ఆల్ టైమ్ హిట్ ‘ధురంధర్’ రికార్డును బ్రేక్ చేసింది. Sacnilk.com ప్రకారం.. ధురంధర్ మొదటి రోజు ₹27 కోట్లు (నెట్) వసూలు చేయగా, బార్డర్-2 ఏకంగా ₹30 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లలో మాత్రం ధురంధర్ (₹41.5 కోట్లు) కంటే బార్డర్-2 (₹41 కోట్లు) స్వల్పంగా వెనుకబడి ఉంది.
News January 24, 2026
2014 నుంచి విచారణ చేయిద్దాం: భట్టి

TG: సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని, 2014 నుంచి జరిగిన టెండర్లపై విచారణ చేయిద్దామని Dy.CM భట్టి అన్నారు. ‘హరీశ్ రావుకు విచారణ కావాలంటే మాకే లేఖ రాయండి. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేయిద్దాం. CM రేవంత్ రాగానే విచారణ కోరతాం’ అని తెలిపారు. తన 40ఏళ్ల ప్రతిష్ఠను కట్టుకథలతో <<18943021>>దెబ్బతీయొద్దన్నారు<<>>. ఆస్తులు కూడబెట్టడానికి కాదు సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.


