News September 17, 2024

జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేశారు: బాధితురాలు

image

జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో అతని భార్య వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పేర్కొంది. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేవాడని ఆమె తెలిపింది. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది.

Similar News

News September 7, 2025

చంద్రుడిని చూశారా?

image

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?

News September 7, 2025

మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

image

AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్‌ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్‌ సమావేశంలో కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్‌-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్‌-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.

News September 7, 2025

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

image

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.