News February 17, 2025

మేం ఏం చేస్తున్నామో తెలియాలంటే RSSలో చేరండి: మోహన్ భాగవత్

image

తాము ఏం చేస్తున్నామో తెలుసుకునేందుకు ప్రజలు తమ సంస్థలో సభ్యులుగా చేరాలని RSS చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. బెంగాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బయటి నుంచి చూస్తూ అనేక అపోహల్ని చాలామంది నమ్ముతున్నారు. మీరు సంఘ్ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి చేరి చూడండి. మేం చేసేది మీకు నచ్చకపోతే వదిలి వెళ్లిపోండి. చేరేందుకు సభ్యత్వ రుసుం, నిబంధనల్లాంటివేం లేవు’ అని వివరించారు.

Similar News

News November 18, 2025

‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్‌తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్‌కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.

News November 18, 2025

బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

image

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.

News November 18, 2025

వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

image

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.