News March 17, 2024
రేపు BRSలో చేరుతున్నా: ప్రవీణ్ కుమార్
TG: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన RS ప్రవీణ్‌కుమార్.. BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘నా రాజకీయ భవితవ్యంపై శ్రేయోభిలాషులతో చర్చించా. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రేపు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 23, 2024
భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
News December 23, 2024
ALERT.. 3 రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
News December 23, 2024
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా
దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్‌తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.