News June 11, 2024
బ్రిక్స్‌లో 5 దేశాల చేరిక.. స్వాగతించిన ఇండియా

BRICS కూటమిలో ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ, ఇథియోపియా చేరడాన్ని భారత్ స్వాగతించింది. రష్యాలో నిర్వహించిన కీలక సమావేశానికి ఆయా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ‘బ్రిక్స్ కుటుంబం విస్తరించింది. కొత్తగా సభ్యత్వం తీసుకున్న దేశాలకు స్వాగతం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి <<13286327>>BRICS<<>> కూటమి ఏర్పాటుచేశాయి.
Similar News
News November 8, 2025
DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
AFCAT నోటిఫికేషన్ విడుదల

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్(MPC), BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు NOV 10 నుంచి DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20-24ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌కు 20-26ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,00-రూ.1,77,500 చెల్లిస్తారు. కోర్సు 2027 JANలో ప్రారంభమవుతుంది.
News November 8, 2025
వేదాల గురించి ప్రముఖులు ఏమన్నారంటే..?

వేదాల గురించి భారతీయ ప్రముఖులు గొప్పగా ప్రవచించారు. ఆదిశంకరులు వేదాలను కన్నవాళ్ల కంటే అధిక హితాన్ని, శుభాలను కోరుకునేవిగా పేర్కొన్నారు. అవి మానవాళికి అత్యున్నత శ్రేయస్సును అందిస్తాయన్నారు. వివేకానందుడు వేదాలు అపూర్వమైన శక్తికి స్థానాలని చెప్పారు. వాటిని చదివితే ఈ లోకాన్ని ఇంకా శక్తిమంతం చేయొచ్చని చెప్పారు. వ్యక్తిగత, విశ్వ శ్రేయస్సుకు వేద జ్ఞానం మూలమని యువతకు మార్గనిర్దేశం చేశారు. <<-se>>#VedikVibes<<>>


