News April 9, 2024
ఇకపై సంయుక్తంగా సెంట్రల్, స్టేట్ GST ఆడిట్స్

బిజినెస్ ఆడిట్లకు సంబంధించి వ్యాపార వర్గాలకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇకపై సెంట్రల్, స్టేట్ GST అధికారులు సంయుక్తంగా ఈ ఆడిట్స్ నిర్వహించనున్నారు. ఇరు ఏజెన్సీలు సమాంతరంగా ఆడిట్లు చేస్తుండటం వల్ల ప్రస్తుతం దాదాపు 11వేల కేసులు చిక్కుల్లో ఉన్నాయట. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు కలిసి పనిచేయాలని ఏజెన్సీలు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే CBIC సంబంధిత జోన్లకు మార్గదర్శకాలు జారీ చేసిందట.
Similar News
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.
News December 5, 2025
మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్‌లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.
News December 5, 2025
టెంపుళ్ల ఆదాయంపై సుప్రీం కీలక తీర్పు

ఆలయాల ఆదాయం దేవునికి సంబంధించిందని, బ్యాంకుల మనుగడకు ఆ నిధులు వాడుకోరాదని SC స్పష్టం చేసింది. కేరళ తిరునల్వేలి ఆలయ డిపాజిట్లను 2నెలల్లో చెల్లించాలన్న HC తీర్పుపై కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను విచారించింది. వెంటనే చెల్లించాలంటే సమస్యలున్నాయని ఆ బ్యాంకులు పేర్కొనగా ‘అది మీ సమస్య’ అంటూ CJI వ్యాఖ్యానించారు. డిపాజిట్‌దారుల్లో నమ్మకం పెంచాలని, టైమ్ పొడిగింపునకు HCని ఆశ్రయించాలని సూచించారు.


