News March 16, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు..

➯పెనమలూరు- జోగి రమేశ్
➯విజయవాడ- వెస్ట్ షేక్ ఆసిఫ్
➯విజయవాడ- సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్
➯విజయవాడ- తూర్పు- దేవినేని అవినాశ్
➯మైలవరం- శర్నాల తిరుపతిరావు
➯నందిగామ-మొండితోక జగన్మోహన్ రావు
➯జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను
Similar News
News November 1, 2025
నేడు లండన్ వెళ్లనున్న సీఎం దంపతులు

AP: CM చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ <<17985147>>అవార్డును<<>> అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.
News November 1, 2025
ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 1, 2025
పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.


