News May 4, 2024

రామమందిరంతో యూపీ రెవెన్యూకి జోష్

image

GST నెలవారీ కలెక్షన్ల జాబితాలో UP వృద్ధి సాధించడం చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌లో రూ.12,290కోట్ల వసూళ్లతో తమిళనాడును వెనక్కినెట్టి యూపీ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏకంగా 19% వృద్ధిని నమోదు చేసింది. అయోధ్య రామమందిరం, టూరిజంపై దృష్టి పెట్టడం, మౌలికవసతుల అభివృద్ధి మొదలైనవి ఈ వృద్ధికి కారణమంటున్నారు విశ్లేషకులు. కాగా GST వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News January 9, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

image

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.

News January 9, 2026

TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

News January 8, 2026

అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

image

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్‌లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.