News September 28, 2024

నేడు రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.

Similar News

News November 9, 2025

ష్.. ఊపిరి పీల్చుకో..!

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పర్వం ముగిసింది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతల గొంతులు సైలెంట్ అయ్యాయి. ఎన్నికల 48గం. ముందు సైలెన్స్ పీరియడ్ రూల్‌తో జూబ్లీహిల్స్ ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. విమర్శలు, సవాళ్లు, సెంటిమెంట్లు, డెవలప్మెంట్లు సహా ఎన్నో విన్న ప్రజాస్వామ్య దేవుళ్లు ఈ నెల 11న తమ తలరాత రాసుకోనున్నారు. అటు బిహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.

News November 9, 2025

డెడ్ బాడీలో రక్త ప్రసరణ.. డాక్టర్ల అరుదైన ఘనత

image

ఢిల్లీలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రక్రియలో విజయం సాధించారు. పక్షవాతంతో చనిపోయిన గీతా చావ్లా(55) అనే మహిళ శరీరంలో రక్తప్రసరణను తిరిగి ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఇందుకోసం ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్(ECMO)ను ఉపయోగించారు. తర్వాత ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించి ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఇలా చేయడం ఆసియాలోనే తొలిసారి అని ఆస్పత్రి ఛైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు.

News November 9, 2025

SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<>SFIO<<>>)36 డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ ప్రాసిక్యూటర్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, LLB, CA, MA, M.COM, MBA/PGDM ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://sfio.gov.in