News December 6, 2024

రేపు రాష్ట్రానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ వస్తున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ కూడా హాజరవుతారు.

Similar News

News November 2, 2025

తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 2, 2025

పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

image

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

News November 2, 2025

ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

image

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్‌ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ అంటారు. అలా అయితే ట్రాన్స్‌వెజైనల్‌ సర్‌క్లేజ్‌ అంటే వెజైనాలోంచి సెర్విక్స్‌ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్‌అబ్డామినల్‌ అప్రోచ్‌ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్‌ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.