News August 13, 2024

జేపీసీకి బీజేపీ ఎంపీ నేతృత్వం

image

వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు – 2024పై ఏర్పాటైన జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి బీజేపీ ఎంపీ జ‌గ‌దాంబిక పాల్‌ నేతృత్వం వ‌హించ‌నున్నారు. కేంద్రం ఆగ‌స్టు 8న ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. అయితే, విపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. బిల్లుపై విస్తృత‌మైన అభిప్రాయాలు తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో కేంద్రం 31 మంది స‌భ్యుల‌తో కూడిన‌ జేపీసీని ఏర్పాటు చేసింది.

Similar News

News October 29, 2025

రాహుల్ గూండాలా మాట్లాడుతున్నారు: బీజేపీ

image

ఓట్ల కోసం <<18140008>>డాన్స్<<>> చేయమన్నా చేస్తారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడింది. ‘మోదీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని రాహుల్ అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’ అని విమర్శించింది. చొరబాటుదారులకు బహిరంగంగానే ఆయన అండగా నిలుస్తున్నారని ఫైరయింది.

News October 29, 2025

ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

image

ప్రెగ్నెన్సీలో అదనపు పోషకాలు తీసుకోవడం తప్పనిసరి. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌ D, కాల్షియం అవసరం. విటమిన్‌ A, అయొడిన్‌ శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.