News December 18, 2024

జమిలి ఎన్నికలపై ‘JPC’.. ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు

image

జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటైంది. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది MPలు ఉన్నారు. పీపీ చౌదరి, సీఎం రమేశ్, హరీశ్ బాలయోగి, బాలశౌరి, బన్సూరి రమేశ్, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకూర్, విష్ణు దయాల్, భర్తృహరి, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు శర్మ, ప్రియాంకా గాంధీ, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సెల్వగణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, చందన్ చౌహాన్.

Similar News

News October 17, 2025

ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CBN ఆదేశం

image

AP: ఉచిత ఇసుక ప్రజలందరికీ అందేలా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని CBN ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలు విస్తృతం చేయాలని సూచించారు. ‘ఇసుక లోడింగ్‌, రవాణాకు తక్కువ ఖర్చయ్యేలా చూడండి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాల నిఘా పెంచండి’ అని సూచించారు. ఈ సీజన్లో 65లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశామని, స్టాక్ పాయింట్లలో 43లక్షల టన్నులు సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు.

News October 17, 2025

త్వరలో 10 గ్రాముల బంగారం ధర రూ.2లక్షలు: నిపుణులు

image

రోజురోజుకూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు. మీరేమంటారు?

News October 17, 2025

రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

image

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/