News November 23, 2024
మరో బాలీవుడ్ చిత్రంలో జూ.ఎన్టీఆర్?
వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెడుతున్న జూ.ఎన్టీఆర్ అక్కడ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా ఉంటుందని, సరైన కథ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని టాక్. త్వరలోనే కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఉంటుందని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Similar News
News November 24, 2024
TODAY HEADLINES
✒ మహారాష్ట్రలో NDA, ఝార్ఖండ్‌లో ‘INDIA’ విజయం
✒ వయనాడ్: 4,10,931 ఓట్ల తేడాతో ప్రియాంక గెలుపు
✒ MHలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ
✒ 26న మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణం?
✒ ‘మహా’ ఫలితాల్ని ఊహించలేదు: రాహుల్
✒ పవన్ ప్రచారం చేసిన 10 స్థానాల్లో బీజేపీ గెలుపు
✒ ఏపీలో 2029లోనే ఎన్నికలు: సీఎం చంద్రబాబు
✒ కొడంగల్ ప్రజలను ఇబ్బంది పెట్టను: CM రేవంత్
✒ INC 11నెలల పాలనలో 42మంది మృతి: కవిత
News November 24, 2024
మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్.. ఎక్కడంటే?
న్యూజిలాండ్‌లోని క్వీన్స్టౌన్ మైదానం మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్‌గా మారింది. మంచు కొండల పక్కనే ఉన్న ఈ మైదానం చూపరులను ఆకట్టుకుంటోంది. చుట్టూ ఎలాంటి గోడలు, ఫెన్సింగ్ ఉండవు. స్వేచ్ఛగా మ్యాచ్ వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ XI మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
News November 24, 2024
చెప్పులు లేకుండా నడుస్తున్నారా?
పాదరక్షలు లేకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. BP కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని సూచిస్తున్నారు.