News September 27, 2024
జూ.ఎన్టీఆర్ ‘దేవర’ పబ్లిక్ టాక్

Jr.NTR, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’ ప్రీమియర్లు పడ్డాయి. సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్బంప్స్ తెప్పిస్తాయని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ థ్రిల్లింగ్ ట్విస్ట్, అనిరుధ్ BGM అదిరిపోయాయని చెబుతున్నారు. VFX ఇంకా బాగుండాల్సిందని, జాన్వీని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News December 4, 2025
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
News December 4, 2025
సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.


