News October 22, 2025
జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..

TG: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా SMలో దుష్ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

భారత్‌తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఆఖరి 3 మ్యాచ్‌లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్‌వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్‌మ్యాన్, డ్వార్‌షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్‌లూ ఆడనున్నారు.
News October 24, 2025
రబీలో జొన్న సాగు – అనువైన రకాలు

రబీ(యాసంగి)లో తేలికపాటి నీటి తడులకు అవకాశం ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. తేమను నిలుపుకునే లోతైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర చల్కా నేలల్లో జొన్నను సాగు చేయవచ్చు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం. తాండూరు జొన్న-55, తాండూరు జొన్న-1, సి.యస్.వి 29 ఆర్, ఎన్.టి.జె-5, సి.యస్.హెచ్ 39 ఆర్, సి.యస్.హెచ్ 15 ఆర్ వంటి జొన్న రకాలు రబీ సాగుకు అనుకూలం.
News October 24, 2025
98 పోస్టులకు నోటిఫికేషన్

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL) 98 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు NOV 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్ <<>>కేటగిరీకి వెళ్లండి.


