News January 21, 2025
JRG: ఇంటర్ యువతిపై అత్యాచారం.. కేసు నమోదు

అత్యాచారం చేసిన యువకుడిపై ద్వారకాతిరుమల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ద్వారకాతిరుమల మండలానికి చెందిన యువతి, యువకుడు జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ప్రేమ పేరుతో యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో నిన్న అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Similar News
News February 15, 2025
పాలకొల్లు వాసి ఆత్మహత్య

ప.గో జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన చందనాలస్వామి(36) శ్రీకాకుళం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగా టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ట్యాంకులో దూకి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించి, అతను టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మెస్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
News February 15, 2025
ప.గో: ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చాలి..కలెక్టర్

ఇల్లు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని నెరవేర్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీ గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.
News February 14, 2025
భీమవరం: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్ లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుంచి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు.