News March 31, 2025
JRG: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

బైక్‌పై రాజమండ్రిలోని అత్తారింటికి శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. లక్కవరానికి చెందిన నాగేశ్వరరావు(45) తన భార్య రమణమ్మ, కొడుకు షణ్ముఖ్, కుతూరు జాహ్నవితో కలిసి బైక్‌పై బయలుదేరారు. సీతంపేట వద్ద రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వీరనాగేశ్వరరావు మృతి చెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News April 2, 2025
MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్‌ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 2, 2025
NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్‌తో ఇంస్టాగ్రామ్‌లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్‌లో స్కూటీ మీనియేచర్‌ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్‌ను కవిత పోస్ట్ చేశారు.