News February 8, 2025

JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం

image

జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News October 28, 2025

ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

image

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.

News October 28, 2025

శృంగేరి జగద్గురువులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం నల్లకుంటలోని శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా స్వామిజీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీ స్వామికి సీఎం వివరించారు. ఆయన వెంట వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ ఉన్నారు.

News October 28, 2025

అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి: ములుగు కలెక్టర్

image

వారం రోజుల పాటు చేపట్టిన విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టిఎస్ విజిలెన్స్ అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, విజిలెన్స్, ఉద్యోగస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖలో పనిచేసే అధికారులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. విజిలెన్స్ టోల్ ఫ్రీ నెంబర్ 14432తో పాటు, ఎక్స్, ఇంస్టాగ్రామ్ అకౌంట్లను వినియోగించుకోవాలన్నారు.