News June 6, 2024

100% స్ట్రైక్ రేట్ సాధించిన JSP & LJP

image

సార్వత్రిక పోరులో నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు 100% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటాయి. ఏపీలో 21 అసెంబ్లీ, 2MP స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నింట్లో గెలిచింది. అలాగే NDA కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 MP స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితో అన్నిచోట్లా నెగ్గింది. దీంతో అందరిచూపు పవన్, చిరాగ్ పాశ్వాన్‌ వైపు మళ్లింది.

Similar News

News January 6, 2026

ఆ వీడియోలు చూస్తే వారికి తెలిసిపోతుంది!

image

TG: చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, డౌన్‌లోడ్ లేదా షేర్ చేసినా వెంటనే అలర్ట్ వెళ్లేలా ఓ నెట్‌వర్క్ పనిచేస్తోంది. గత ఏడాది 97,556 సైబర్ టిప్ లైన్ అలర్ట్స్ అందగా, 854 కేసులు నమోదు చేసి 376 మందిని అరెస్ట్ చేశారు. 1,635 అనుమానితుల ప్రొఫైల్స్ మానిటరింగ్‌లో ఉన్నాయి. ఐపీ అడ్రెస్‌ల ఆధారంగా గుర్తిస్తున్నారు.

News January 6, 2026

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

image

TG: హైదరాబాద్‌లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇందిరాపార్క్ నుంచి VST వరకు ఒక స్టీల్ బ్రిడ్జి (2.6 KM) ఉండగా, ఇది పూర్తైతే రాష్ట్రంలో రెండోది కానుంది.

News January 6, 2026

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే?

image

అగ్నివీర్ పోస్టుల భర్తీ కోసం సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లో ఫిబ్రవరి 2 నుంచి మే 10 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్, చెఫ్, సపోర్ట్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించండి.