News March 25, 2025

అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డ్

image

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్‌లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.

Similar News

News November 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 17, 2025

ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

image

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.

News November 17, 2025

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

*1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
*1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
*1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
*1978: నటి కీర్తి రెడ్డి జననం
*1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
*2012: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మరణం
*అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం