News October 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ టికెట్ ఎవరికి?

TG: జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్‌ను BJP ఎవరికి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ చేసేందుకు దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, మాధవీలత, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురి పేర్లను రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న పార్టీ నేతలు మరోసారి సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
Similar News
News October 8, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కేనా?

తాను పోటీలో లేనని బొంతు రామ్మోహన్ ప్రకటించడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నవీన్ యాదవ్‌కు మార్గం సుగమం అయ్యింది. బీసీ కావడం, లోకల్ లీడర్ల మద్దతుతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. నవీన్ 2014లో MIM తరఫున 41వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో 18వేల ఓట్లతో మూడోస్థానం దక్కించుకున్నారు. 2023లో కాంగ్రెస్ విజ్ఞప్తితో పోటీ నుంచి తప్పుకుని అజాహరుద్దీన్‌కు సపోర్ట్ చేశారు.
News October 8, 2025
నేడు..

☕TG: BCలకు 42% రిజర్వేషన్ల G.O.పై హైకోర్టులో విచారణ
☕AP: లిక్కర్ కేసు నిందితులు కసిరెడ్డి, బాలాజీ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
☕AP: డిమాండ్ల సాధనకై PHC డాక్టర్ల దీక్ష
☕AP: పిన్నెల్లి సోదరులకు ముగియనున్న SC మధ్యంతర బెయిల్
☕ మెదక్ జిల్లాలో పంటనష్ట ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన
☕WWC: 3PMకు ఆస్ట్రేలియా Vs పాక్ మ్యాచ్
☕క్లచ్ చెస్ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్-గ్యారీ కాస్పరోవ్ ఢీ
News October 8, 2025
థైరాయిడ్ మందులు మానేయొచ్చా?

చాలామంది థైరాయిడ్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని మందులు వాడటం మానేస్తారు. కానీ ఇది సరికాదని, మందులు వాడటం వల్లే థైరాయిడ్ నార్మల్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే 12.5- 25mg వాడేవారు వీటిని ఆరు వారాల తర్వాత ఓసారి పరీక్షించుకొని నార్మల్‌గా ఉంటే మందులు వాడటం మానేయొచ్చని సూచిస్తున్నారు. అయితే థైరాయిడ్ సమస్య అదుపులో ఉన్నట్టు నిర్ధారణ అయినా డాక్టర్ సలహా మేరకే మందులు ఆపాలని చెబుతున్నారు.