News October 6, 2025

జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది

image

మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ MLA స్థానం ఉప ఎన్నిక NOV 11న జరగనుంది. OCT 13న నోటిఫికేషన్ విడుదలై ఆరోజు నుంచి OCT 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న స్క్రుటినీ, 23న విత్‌డ్రా చివరి తేదీ. జూబ్లీహిల్స్‌తో పాటు JK- బుద్గాం, నగ్రొటా, రాజస్థాన్-అంటా, జార్ఖండ్- ఘఠసిల, పంజాబ్- తర్న్ తరణ్, మిజోరం- దంప, ఒడిశా-నౌపాడ స్థానాలకూ ఇదే షెడ్యూల్లో బైపోల్ ఉంటుంది. NOV 14న కౌంటింగ్, ఫలితాలు.

Similar News

News January 25, 2026

మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ లిస్టులో మరో 14 కులాలు

image

TG: మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (MBC) లిస్టులో మరో 14 కులాలను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో కేంద్రానికి లేఖ రాయనుంది. ప్రస్తుతం MBC లిస్టులో 36 కులాలు ఉండగా, ఆ సంఖ్య 50కి చేరనుంది.
14 కులాలు: దాసరి(బెగ్గరి), జంగం, పంబాల, వాల్మికి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, సిద్దుల, సిక్లింగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు, కునపులి, రాజనాల, బుక్క అయ్యవారాస్.

News January 25, 2026

రథసప్తమి.. తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

image

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ నుంచి చంద్రప్రభ వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. నేడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ చేయనుంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్సుంది.

News January 25, 2026

బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది: నఖ్వీ

image

T20 WC నుంచి తప్పించి బంగ్లాదేశ్‌కు ICC అన్యాయం చేసిందని PCB ఛైర్మన్ మోషిన్ <<18947264>>నఖ్వీ<<>> అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ కోసం వెన్యూలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు మార్చరు? ఐసీసీని ఒకే దేశం డిక్టేట్ చేస్తోంది. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే మేం బంగ్లాదేశ్‌కు మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.