News April 20, 2024

జూబ్లీహిల్స్ ప్రమాదం.. SI సస్పెండ్

image

2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో SI సస్పెండ్ అయ్యారు. బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు రాహిల్‌‌ కారు ఢీకొట్టగా ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో అప్పుడు జూబ్లీహిల్స్ SIగా ఉన్న చంద్రశేఖర్‌ను తాజాగా కమిషనర్ శ్రీనివాస‌రెడ్డి సస్పెండ్ చేశారు.

Similar News

News March 4, 2026

NATO దేశమైన తుర్కియేపైకి ఇరాన్ మిస్సైల్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. NATO సభ్య దేశమైన తుర్కియేపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ఫైర్ చేసింది. ఇరాక్, సిరియా దేశాలపై నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని, దాన్ని NATO ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని తుర్కియే మంత్రి వెల్లడించారు. సిరియా సరిహద్దుల్లో శకలాలు పడ్డాయన్నారు. కాగా NATO దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలూ రంగంలోకి దిగాలనే నిబంధన ఉంది.

News March 4, 2026

శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

image

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.

News March 4, 2026

భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

image

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.