News August 14, 2024
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జూడాల నిరసన

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. HYD గాంధీ ఆసుపత్రి, మంగళగిరి ఎయిమ్స్‌లో జూడాలు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. రేప్ నిందితుడిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
TODAY HEADLINES

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్‌నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్
News November 24, 2025
ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకున్నా: మారుతి

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకొని పనిచేశానని, ఆయన ఫొటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారని మారుతి అన్నారు. ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ‘ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ <<18369126>>ఈ పాట <<>>చేశారు. కేరింతలతో థియేటర్స్ రీసౌండ్ వస్తాయి. ముగ్గురు హీరోయిన్స్‌తో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడాలి. రిలీజ్‌కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉంటారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తున్నా’ అని చెప్పారు.
News November 24, 2025
జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

తైవాన్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్లో చైనా పేర్కొంది.


