News June 21, 2024

ఈ నెల 24 నుంచి జూడాల సమ్మె

image

TG: జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. స్టైఫండ్ సహా వివిధ సమస్యలను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిన్నటి నుంచి నిరసనలు మొదలుపెట్టారు. తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కోసం కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ నిర్మించాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 21, 2025

విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

image

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్‌ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.