News January 29, 2025
ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న జడ్జి

నిధులను ఫ్రీజ్ చేస్తూ ట్రంప్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని US డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి లారెన్ అలీఖాన్ తాత్కాలికంగా అడ్డుకున్నారు. MON వరకు స్టే ఇచ్చారు. DEI సహా అనేక ప్రోగ్రామ్స్ అమలు కోసం రాష్ట్రాలు, కొన్ని సంస్థలకు ఫెడరల్ గవర్నమెంట్ లోన్లు, గ్రాంట్లు ఇస్తుంది. వీటిని సమీక్షించాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో సందిగ్ధం నెలకొంది. దీంతో NGOలు కోర్టును ఆశ్రయించాయి.
Similar News
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <


