News October 23, 2024

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై నేడు తీర్పు

image

TG: బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని అందిన ఫిర్యాదుపై కేంద్రం విచారించి 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.

Similar News

News October 23, 2024

బాధలోనే జీవన్ అలా మాట్లాడారు: TPCC చీఫ్

image

TG: తన అనుచరుడు హత్యకు గురికావడంపై MLC జీవన్ రెడ్డి ధర్నా చేయడంతో పాటు పార్టీపైనా <<14422586>>అసంతృప్తి<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుచరుడు చనిపోయాడనే బాధలోనే జీవన్ అలా మాట్లాడారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి MLAలు వచ్చిన చోట ఇబ్బందులను పరిష్కరిస్తాం. జీవన రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబుకి అప్పగించాం’ అని తెలిపారు.

News October 23, 2024

నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటన

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం YSR జిల్లా బద్వేలు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

News October 23, 2024

తుఫాను ముప్పు.. నాలుగు రోజులు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో AP, ఒడిశా, బెంగాల్, TN రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.