News June 30, 2024
రేపు MLC కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు!

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
Similar News
News December 10, 2025
సిరిసిల్ల: రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్

జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండలాల్లో 85 సర్పంచ్, 758 వార్డు స్థానాలకు గాను 9 సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్, 519 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
News December 10, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


